శ్రీకాకుళం జిల్లా, గార మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో గల బురవెల్లి గ్రామ ప్రజలు నాగులచవితి మరియు భోగి పండుగ జరుపుకోరు. ప్రతి ఏట కార్తీక మాసం శుద్ధ షష్టి రోజున నాగులచవితి జరుపుకొంటారు. ఈ ఆచారం కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది అని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికే ఇదే సాంప్రదాయాన్ని గ్రామ యువత, పెద్దలు పాటిస్తున్నారు.