BPT: సైబర్ నేరాల నివారణపై విద్యార్థి దశ నుంచే యువత అవగాహనతో ఉండాలని ఎస్పీ ఉమామహేశ్వర సూచించారు. శుక్రవారం బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుర్తు తెలియని లింక్లు క్లిక్ చేయవద్దని, అలాగే వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ఆయన కోరారు.