BDK: రైతుల ఆర్థికాభివృద్ధి దిశగా వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలను సమీకరించడం అత్యంత అవసరమని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. బూర్గంపాడు మండలం ఎంపీ బంజారలో సమీకృత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను వారు గురువారం ప్రారంభించారు. రైతులు కూరగాయల సాగుతో పాటు బంతిపువ్వులు, కొర్రమీను, కౌజు పిట్టలు సాగు చేపట్టాలన్నారు.