NLR: పొదలకూరు మండలంలోని రైతులకు 3,085 బస్తాల యూరియాను పంపిణి చేసినట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలిపారు. రెండో విడతలో ఇంకా యూరియా తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి రైతుకూ ఎకరాకు 3 బస్తాల యూరియా అందిస్తామన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను కచ్చితంగా పాటించాలని కోరారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.