NRPT: జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల్లో ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వరి ధాన్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే వీటి ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ చెకోపోస్టుల వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తారని, అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటారని ఎస్పీ వివరించారు.