KRNL: బస్సు ప్రమాదం జరిగిన చోటుకు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్, SP చేరుకున్నారు. ‘బస్సులో 13 మంది తెలంగాణవాసులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఏడుగురికి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురు HYD, ఖమ్మం, RR, సంగారెడ్డికి చెందినవారిగా గుర్తించాం. మిగిలిన ఆరుగురు చనిపోయారా బతికున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది’ అని అన్నారు.