VZM: బంగ్లాదేశ్లో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు ప్రారంభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి వివరాలు సేకరించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు పంపించామని చెప్పారు. APNRT, భారత హైకమిషన్ ద్వారా కూడా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి హామీ ఇచ్చారు.