MNCL: కిసాన్ కపాస్ యాప్‌లో రైతులు స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తిని విక్రయించే అవకాశం ఉంటుందని జన్నారం మండల ఏవో సంగీత, ఏఈఓ త్రిసంధ్య తెలిపారు. శుక్రవారం జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో రైతులకు కిసాన్ కపాస్ యాప్ పై అవగాహన కల్పించారు. సీసీఐలో పత్తిని విక్రయించాలంటే రైతులు ముందస్తుగా రిజిస్టర్ ఫోన్ నెంబర్‌తో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.