KNR: తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన అలువాల శంకర్ గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా నాగుపాము కాటుకు గురై మృతి చెందాడు. పాము కాటును ఆలస్యంగా గుర్తించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన శంకర్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్తికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. స్థానికులు ఇంట్లోనే పామును గుర్తించి చంపేశారు. శంకర్ భార్యాపిల్లలతో సహా జీవిస్తున్నాడు.