ADB: హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. గత 2 రోజుల క్రితం హైదరాబాద్లో గో రక్షకుడు సోను ప్రశాంత్ అనే కార్యకర్తపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ ఇచ్చోడ మండల కేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. గన్ కల్చర్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పేర్కొన్నారు.