శ్రీకాకుళం బాపూజీ కళామందిర్ ప్రాంగణంలో విశాలాంధ్ర సంచార పుస్తకాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని పుస్తకాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. “యువత పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. నేటి తరానికి సోషల్ మీడియా దగ్గరైంది, కానీ పుస్తకాలే పునాది అన్నారు.