BDK: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో భద్రాచలం ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఏజెన్సీ ప్రాంతాలకు బస్సులు నడుపుతామని డిపో అధికారులు తెలిపారు. రాత్రి సమయాల్లో చర్ల, కుంట, చింతూరు మండలాల్లోని ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.