కర్నూలు బస్సు ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రమాద ఘటనలో భారీ ప్రాణ నష్టం చాలా బాధించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి పునరావృత ప్రమాదాలు మన ప్రజా రవాణా వ్యవస్థల భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి’ అని పేర్కొన్నారు.