NTR: విజయవాడ ESI ఆస్పత్రికి మంత్రి వాసంశెట్టి సుభాష్ CSR నిధులతో 3 అంబులెన్సులు అందజేశారు. ఇవి విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ESI ఆస్పత్రుల నుంచి సేవలందించాల్సి ఉంది. అయితే, డ్రైవర్లను కేటాయించాలని మంత్రి లేఖ రాసినా, ఇప్పటికీ ఒక్క డ్రైవర్ను నియమించకపోవడంతో అంబులెన్సులు విజయవాడలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. అధికారులు స్పందించి డ్రైవర్లను నియమించాలని కోరారు.