‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ రచయిత శ్రీకాంత్ విస్సా దర్శకత్వంలో కళ్యాణ్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కళ్యాణ్‌కు దర్శకుడు కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.