NLR: దగదర్తి మండలానికి చెందిన సుబ్బానాయుడు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు. దీంతో మంత్రి పొంగూరు నారాయణ దగదర్తి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుబ్బానాయుడుతో పాటు ఆయన అన్న కొడుకు సైతం ఇటీవల మృతి చెందడంతో రెండు కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.