NZB: మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియగా జిల్లాలోని 102 షాపులకు గానూ 2,786 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఒక్కో టెండర్‌కు రూ. 3 లక్షల చొప్పున రూ. 83.58 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గత టెండర్లలో 3,759 దరఖాస్తులు రాగా.. ఈసారి టెండర్లను రూ. 3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తగ్గాయి.