సత్యసాయి: జిల్లాలో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించే ప్రణాళికలు రూపొందించాలన్నారు. అధిక ఎరువుల వినియోగాన్ని కట్టడి చేసి, ఎరువులను ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని సూచించారు.