MDK: ప్రజారక్షణకు పోలీసులు కృషి చేస్తున్నారని తూప్రాన్ డీఎస్పి నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం తూప్రాన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవం పురస్కరించుకొని ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఓపెన్ హౌస్కు హాజరైన విద్యార్థులకు పోలీస్ చట్టాలు, పోలీసుల విధులు, ఆయుధాలపై అవగాహన కల్పించారు. సీఐ రంగా కృష్ణ, ఎస్సై శివానందం పాల్గొన్నారు.