NGKL: పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో ముస్లింలు గురువారం మహబూబ్ సుభాని గందోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మసీదు నుంచి బయలుదేరిన గందోత్సవం పురవీధుల గుండా ఊరేగింపు గా సాగింది. అనంతరం మహబూబ్ సుభాని దర్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ఫాతేహాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు.