TPT: తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో గురువారం గ్లోబల్ అండ్ వాషింగ్ డే అవగాహన సదస్సు నిర్వహించినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ.. ఈ ఏడాది గ్లోబల్ థీమ్ ‘చేతులు కడుక్కొని హీరో అవ్వండి’ అనే నినాదాన్ని సూచించారు. ప్రతి వ్యక్తి తమను తాము, తమ సమాజాన్ని రక్షించుకునే సరళమైన ప్రాణ రక్షక చర్యలు తీసుకోవాలన్నారు.