WNP: ఘణపురం మండలంలోని లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్లును గురువారం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించిన ఆయన, రైతులకు సకాలంలో చెల్లింపులు అందేలా చూడటానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలో భాగంగా, ధాన్యం అన్లోడింగ్ను వేగవంతం చేయాలని మిల్లు యజమానులను ఆదేశించారు.