NLR: వరికుంటపాడు మండలంలోని కనియం పాడులో వద్ద పిల్లాపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని అధికారులు గురువారం పేర్కొన్నారు. ఇందులో భాగంగా కనియం పాడు రామదేవులపాడు గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ప్రజలు వాగును దాటే ప్రయత్నం చేయరాదని ఎమ్మార్వో హేమంత్ కుమార్, ఎస్సై రఘునాథ్ తెలిపారు.