HYD: ఫ్యూచర్ సిటీకీ అద్భుతమైన బాటలు వేసేందుకు యంత్రాంగం కసురత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, హెల్త్, లైఫ్ సైన్సెస్,ఎడ్యుకేషన్ జోన్లుగా విభజించి వాటిని ప్రత్యేకంగా రూపుదిద్దడంతో పాటు,చుట్టూరా అద్భుతమైన రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు.దాదాపు 40 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రహదారుల నిర్మాణం జరగనుంది.