CTR: పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అందించే ఉచిత భోజనాన్ని మెడికల్ ఆఫీసర్ హరగోపాల్ పరిశీలించారు. గురువారం డైట్ విభాగాన్ని తనిఖీ చేశారు. రోగుల కోసం తయారుచేసిన అన్నం, సాంబార్, రసం, తాలింపు, చిక్కీలను గమనించారు. ఆయన మాట్లాడుతూ.. రోగులకు ప్రతిరోజు మూడు పూటల అందించే ఆహారం రుచిగా ఉండాలని సూచించారు.