AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పాపాలు చేసే వాళ్లు నీతులు చెప్పడమా?.. నకిలీ మద్యం కేసుతో సంబంధం లేదని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడులను అడ్డుకుని సొంత సంస్థలతో మద్యం సరఫరా చేయించారని ఆరోపించారు.