ELR: కొయ్యలగూడెం మండలం పొంగుటూరు పంచాయతీ పరిధిలోని శివారు గ్రామమైన కన్నాయిగూడెంలో ఇవాళ పెంకుటిల్లు కూలిపోయింది. గ్రామంలో కురిసిన భారీ వర్షానికి కోడె రాంబాబుకి చెందిన ఇల్లు నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. అతని తల్లి పాపమ్మతో ఇంట్లో ఉన్న రాంబాబు తలకి గాయాలయ్యాయి. రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు వీఆర్వో పొన్నా రమేష్‌కు అవేదన వ్యక్తం చేశాడు.