AP: విజయనగరం జిల్లా మత్స్యకారుల అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. త్వరలోనే మత్స్యకారులను స్వస్థలానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే దీనిని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.