ప్రకాశం: పొన్నలూరు మండలంలోని కల్లూరివారిపాలెం పాలేరును మండల ఎంపీడీవో సుజాత, మండల స్పెషల్ ఆఫీసర్ సువార్త పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పాలేరుకు వరద నీరు చేరిన నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. అనంతరం జేసీబీ సాయంతో నీటిలోతు ఎక్కువగా ఉన్న మార్గం నుంచి ప్రజలు వెళ్లకుండా ఉండేందుకు ముళ్ల చెట్లను అడ్డుగా పెట్టారు.