ప్రకాశం: భారీ తుఫాను ప్రభావం కారణంగా వెలిగండ్ల మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ వాసు తెలిపారు. రాబోయే 3 రోజుల్లో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్వలు, వాగులు దాటకూడదని హెచ్చరించారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.