VKB: బషీరాబాద్ కేజీబీవీను తహశీల్దార్ శాహీద బేగం, ఎంఈఓ దూస రాములతో కలిసి తనిఖీ చేసారు. కేజీబీవీలోని విద్యార్థులకు కల్పిస్తున్న పలు సౌకర్యాలను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హజరు కావాలని కోరారు.