AP: తిరుపతిలోని SVU పోలీస్ స్టేషన్లో విచారణకు వైసీపీ నేత భూమన కరుణాకర్ హాజరయ్యారు. టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై భూమన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు భూమనపై కేసు నమోదు చేశారు. అయితే ఆరోపణలకు ఆధారాలు చూపాలని, విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.