KRNL: ఎమ్మిగనూరులో వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిపారు. నియోజకవర్గ ఇంఛార్జ్ బుట్టా రేణుక మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని వివరించారు.