BDK: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గురువారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. మణుగూరు పట్టణానికి చెందిన జోగునూరు రాణి ఐదు కేజీల బాల భీముడికి జన్మనిచ్చారు. భద్రాచలం ఆస్పత్రి సూపర్డెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో గైనకాలజిస్ట్ డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించి తల్లి పండంటి మగ బిడ్డకు కాన్పు చేశారు. వారి కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.