PLD: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నకరికల్లు మండలం నరసింగపాడులో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త డా. గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పాల్గొని, కార్యక్రమ లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు. ఈ ఉద్యమానికి మద్దతుగా గ్రామస్థులు తమ సంతకాలను నమోదు చేశారు.