WGL: వర్ధన్నపేట పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయంలో గురువారం MLA నాగరాజు మాట్లాడుతూ..సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (SMAM) పథకం ద్వారా సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని రైతులు ఈ నెల 31లోపు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసకోవాలని సూచించారు.