KMM: అయ్యప్ప మాలధారులు శబరిమలలో స్వామి దర్శనానికి వెళ్లేందుకు తక్కువ ఛార్జీలతో RTC బస్సులు సమకూర్చనున్నట్లు ఖమ్మం రీజియన్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. రీజియన్లొని ఏడు డిపోల నుంచి సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని, ఐదు, ఏడు రోజుల ప్రయాణంలో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట స్వాములకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని తెలిపారు.