ప్రకాశం: భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్నీ మండలాల్లో పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు కంపెన్సేటరీ హాలిడే కింద సెలవును జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు పోవద్దన్నారు.