AP: బస్సు ప్రమాద ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనాస్థలికి అనిత బయల్దేరారు. అయితే అంతకముందు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్పీ, అగ్నిమాపక డీజీతో ప్రమాద తీవ్రతపై హోంమంత్రి మాట్లాడారు. బస్సులో 44 మంది ఉన్నట్లు హోంమంత్రి అనితకు అధికారులు తెలిపారు. 18 మంది ప్రయాణికులు సురక్షితమని వివరించారు.