NGKL: పెంట్లవెల్లి కేజీబీవీ విద్యార్థిని సంధ్య రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొనడం అభినందనీయమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్లో సంధ్యను అభినందించి ప్రశంస పత్రం అందజేశారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థిని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన కోరారు.