KRNL: కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్లో ఉన్న సీఎంకు అధికారులు బస్సు దగ్ధంలో పలువురు మృతి చెందిన ఘటన వివరాలు తెలియజేశారు. సీఎస్, ఇతర అధికారులు ఘటన వివరాలు వివరించారు. సీఎం అన్ని శాఖల ఉన్నతాధికారులను ఘటన ప్రాంతానికి పంపి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు.