HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మొత్తం 251 మంది అభ్యర్థులు 321 నామినేషన్లను దాఖలు చేశారు. వీటిలో పత్రాలు సరిగ్గా లేని, ఖాళీలు భర్తీ చేయని 186 నామినేషన్లను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. అన్ని పత్రాలు పరిశీలించిన అనంతరం 81 మంది అభ్యర్థులు ఆమోదం పొందారు. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎంతమంది బరిలో ఉంటారో తేలనుంది.