E.G: కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం గురువారం మొదలైంది. రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ, ఆయన కుమార్తె బత్తుల వందనాంబిక స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపారాధన చేశారు. అనంతరం వారు దీపారాధన కార్యక్రమానికి రూ. లక్ష విరాళం ప్రకటించారు.