AP: కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. HYD నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారులో అగ్ని ప్రమాదానికి గురైంది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బస్సులోనే పలువురు సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. బస్సులో 40 మంది వరకు ప్రయాణిస్తుండగా.. 25 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం.