AKP: నాతవరం మండలం తాండవ రిజర్వాయర్ నీటిమట్టం గురువారం సాయంత్రానికి 377.6 అడుగులకు చేరినట్లు ప్రాజెక్ట్ జేఈ శ్యాం కుమార్ తెలిపారు. దీని గరిష్ట స్థాయి నీటిమట్టం 380 అడుగులుగా పేర్కొన్నారు. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు నీటిమట్టం పెరుగుతున్నట్లు తెలిపారు. రిజర్వాయర్ లోకి 630 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు పేర్కొన్నారు.