కోనసీమ: జిల్లాలోని అన్ని హోటళ్లలో ఆహార పదార్థాల కల్తీ, నాణ్యత తెలుసుకునేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని జేసీ నిశాంతి అధికారులను ఆదేశించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద జరిగిన జిల్లా ఆహార భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పండుగల వేళ ఆహార కల్తీపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. డీఆర్వో మాధవి అధికారులకు తనిఖీలపై సూచనలు చేశారు.