NZB: CPRపై విద్యార్థులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని ప్రభుత్వ వైద్యురాలు హసీనా సూచించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు CPRపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు ప్రాక్టికల్‌గా CPR ఏవిధంగా చేయాలో చేసి చూపించారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయపాల్ రెడ్డి, అధ్యాపకులు మధు, రాజకుమార్, వైష్ణవి, గంగాధర్ ఉన్నారు.