TG: కరీంనగర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నా చేశారు. వంగర పీవీరంగారావు గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో మృతదేహంతో అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కౌశిక్ రెడ్డి పాల్గొని విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.