ELR: గురువారం భీమడోలు సర్కిల్ పోలీసులు బస్టాండుల్లో చోరీకి పాల్పడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన వేములపల్లి దుర్గను అరెస్ట్ చేశారు. ప్రయాణికుల బ్యాగులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుండి 33.5 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.