W.G: కార్తీక మాసం సందర్భంగా భీమవరం పంచారామ క్షేత్రానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదానానికి 32 క్వింటాళ్ల త్రిబుల్ సెవెన్ సోనా మైసూర్ బియ్యాన్ని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆలయ అధికారులకు గురువారం అందించారు. ముందుగా స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బియ్యం వితరణ చేసారు.